పెగడపల్లి మండలంలో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి
రిపోర్టర్: హరి
స్థలం: పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపల్లి గ్రామంలో గణేష్ మండపం వద్ద దీపారాధన చేస్తుండగా గడ్డం మధు అనే యువకుడికి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. స్నేహితులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ అకస్మాత్ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం అలుముకోగా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.