విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దసరా ఉత్సవాల షెడ్యూల్ ఖరారు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Vijayawada
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గాదేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 11 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆలయ అధికారులు మరియు పాలక మండలి ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఈ వేడుకలకు ఆహ్వానించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. పది రోజుల పాటు అమ్మవారు విభిన్న అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.