ఉత్తరప్రదేశ్ లోని దియోరియాలో అద్భుతమైన కదిలే శివలింగం

రిపోర్టర్: మహేష్ స్థలం: Uttar Pradesh

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దియోరియా జిల్లా రుద్రపురంలో ఉన్న దుగ్దేశ్వరనాథ ఆలయంలోని శివలింగం ప్రత్యేకంగా కదులుతుందని స్థానికులు అర్చకులు తెలిపారు. రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శివలింగం భూమిపైనే ప్రతిష్టించబడి ఉందని పేర్కొన్నారు. ఈ శివలింగం కొన్నిసార్లు ఏకధాటిగా ఇరవై నాలుగు గంటల పాటు కదులుతూ ఉంటుందని వెల్లడించారు. ఈ అద్భుతమైన వింతను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారని తెలిపారు.