నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు: ఈనెల ఇరవై మూడో తేదీన ప్రమాణ స్వీకారం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరపాలక సంస్థ సభ్యుల పదవీ కాలం ఈనెల ఇరవై రెండో తేదీతో ముగియనుందని అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల ఇరవై మూడో తేదీన నూతన కార్పొరేటర్లు మరియు మేయర్ తో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇదే రోజు ఉప మేయర్ ఎన్నిక కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పాలకవర్గ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా పాల్గొంటారని అధికారులు స్పష్టం చేశారు.