ఎస్ఆర్ పురం జడ్పీటీసీ బరిలో కాంజేరి చంద్రశేఖర్ సతీమణి: చర్చనీయాంశంగా మారిన రాజకీయం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: శ్రీరంగరాజపురం
శ్రీరంగరాజపురం మండలం జడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడంతో స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ నేత కాంజేరి చంద్రశేఖర్ సతీమణిని అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. రిజర్వేషన్ నేపథ్యంలో జనసేన శ్రేణులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.