'ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు ఎలాంటి సస్పెన్షన్ లేదు': రన్నర్ అభిషేక్ పాల్
రిపోర్టర్: సతీష్
స్థలం: బెంగళూరు
ప్రముఖ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అభిషేక్ పాల్ ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. ఆయనపై ఎలాంటి సస్పెన్షన్ లేదని, పోటీల్లో పాల్గొనవచ్చని నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది. డోపింగ్ ఆరోపణలతో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఎఫ్‌ఐ) ఆయన్ను ఆసియా క్రీడల జాబితా నుంచి తొలగించగా, దీనిపై నాడా కమిటీని ఆశ్రయించగా అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో బెంగళూరుకు చెందిన అభిషేక్ పాల్ ఆసియా క్రీడల్లో పోటీ పడే అవకాశం లభించింది.