భాషా నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని తలకుంటతండాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు భుక్యా భాషా నాయక్ ఇటీవల మృతి చెందడంతో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. భాషా నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ శ్రేణులకు ఆయన అందించిన సేవలను స్మరించుకున్న ఎమ్మెల్యే నాగరాజు, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.