లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కిన తహసీల్దార్

రిపోర్టర్: Mulugu News స్థలం: ములుగు

ములుగు జిల్లా గోవిందరావుపేట తహసీల్దార్ సృజన్కుమార్ భూమి పట్టా మార్పిడి కోసం రూ.14 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా ముందస్తు ప్రణాళికతో ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.