కరవు జాబితాలో నెల్లూరుకు నిరాశ: నిబంధనల పేరుతో అన్నదాతల ఆవేదన

రిపోర్టర్: సతీష్ స్థలం: నెల్లూరు

ప్రభుత్వం తాజాగా ప్రకటించిన కరవు మండలాల జాబితాలో నెల్లూరు జిల్లాకు చోటు దక్కకపోవడంపై స్థానిక రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ముప్పై మండలాలను ప్రతిపాదించినా ఒక్కటి కూడా ఎంపిక కాలేదని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి వెల్లడించారు. ఉదయగిరి నియోజకవర్గంతో పాటు మెట్ట ప్రాంతాల్లో వర్షాలు పడక చెరువులు ఎండిపోయి, అరవై శాతం భూములు బీడుగా మారాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.