దేశ రాజధానిలో వణికిస్తున్న చలి: డెబ్బై ఐదేళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఉష్ణోగ్రతలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

దేశ రాజధాని దిల్లీలో అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై పాయింట్ ఏడు డిగ్రీలకు పడిపోయిందని, ఇది గత డెబ్బై ఐదేళ్లలో అక్టోబరు నెలలో అత్యంత తక్కువని అధికారులు తెలిపారు. నిరంతర వానలు, శీతల గాలుల ప్రభావంతో రాజధాని వాసులు ఉన్ని దుస్తులు ధరించే పరిస్థితి ఏర్పడిందని, గాలి నాణ్యత మెరుగ్గా ఉందన్నారు.