విజయవాడలో అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రాము స్థలం: Vijayawada

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అజిత్సింగ్నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో పేదలకు సంపూర్ణ హక్కులతో కూడిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నాలుగు దశాబ్దాలకు పైగా ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న 26,401 మంది లబ్ధిదారులకు ఎలాంటి రిజిస్ట్రేషన్ రుసుం లేకుండా ఉచితంగా పట్టాలు అందజేశారు. ఈ చారిత్రక నిర్ణయంతో పేదలకు వారి ఆస్తిపై చట్టబద్ధమైన హక్కు లభించిందని, ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.