యాదాద్రీశుడి సన్నిధిలో ఆంజనేయస్వామికి ఘనంగా ఆకుపూజ నిర్వహణ

రిపోర్టర్: P.srinu స్థలం: భువనగిరి

యాదాద్రి క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి మంగళవారం అర్చకులు శాస్త్రోక్తంగా ఆకుపూజ నిర్వహించారు. కొండపైన విష్ణుపుష్కరిణి వద్ద ఉన్న ఆలయంలో పంచసూక్తాలు, మన్యు సూక్త పఠనాలతో స్వామికి అభిషేకం చేసి, సింధూరం మరియు ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. పాతగుట్ట ఆలయంలోనూ పంచామృతాలతో అభిషేకాలు జరిగాయి. ఈ విశేష పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.