గోదావరి పుష్కరాల పనులను సమన్వయంతో వేగవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: పెద్దపల్లి
పెద్దపల్లి జిల్లాలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కాల్వ శ్రీరాంపూర్ ప్రాంతంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధి, ఘాట్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని స్పష్టం చేశారు. నీటి సరఫరా, విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచేందుకు అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు.