ఏపీ పురపోరు నామినేషన్ల పరిశీలన ఉద్రిక్తత: పలుచోట్ల వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల ఘర్షణ
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పురపోరు నామినేషన్ల పరిశీలన సందర్భంగా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మార్కాపురం, ప్రొద్దుటూరు, కుప్పం ప్రాంతాలలో వైఎస్సార్సీపీ మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కొన్ని చోట్ల పోలీసులు లాఠీలు ప్రయోగించి ఇరువర్గాలను చెదరగొట్టారు. నామినేషన్ల ఘట్టం ముగిసిన తర్వాత ఈ ఘర్షణలు తలెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది.