ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు.

రిపోర్టర్: సునీల్ స్థలం: India

ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30, 2026 వరకు పొడిగించినట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. ఈ పథకం ద్వారా 9 నుంచి 12వ తరగతి వరకు ఏడాదికి రూ.12,000 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.48,000 ఆర్థిక సాయం అందనుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.