విద్యుత్ సిబ్బంది శ్రమ వర్ణనాతీతం: మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసలు
రిపోర్టర్: సునీల్
స్థలం: పశ్చిమ గోదావరి
అర్నబ్ తుఫాను ప్రభావంతో అలుముకున్న చీకట్లను పారదోలేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది చేస్తున్న పోరాటం వర్ణనాతీతమని రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రశంసించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజన్ పరిధిలో జోరు వర్షంలో మెడ లోతు నీటిలో నిలబడి విద్యుత్ స్తంభాన్ని నిలబెట్టడానికి సిబ్బంది శ్రమిస్తున్న వీడియోను ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కష్టకాలంలో శ్రమిస్తున్న ప్రతి కార్మికుడికి, అధికారులకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.