రాష్ట్రంలో శిథిలావస్థకు చేరిన తరగతి గదుల కూల్చివేతకు ఆదేశాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలపై విద్యాశాఖ నిర్వహించిన ఆడిట్లో 6,242 తరగతి గదులు శిథిలావస్థకు చేరినట్లు గుర్తించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈనెల 30లోపు వీటిని కూల్చివేయాలని విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మన బడి- మన భవిష్యత్తు కింద ప్రత్యామ్నాయ వసతులు కల్పించడంతో పాటు గతంలో నిలిచిపోయిన భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.