వైసీపీ వికృత చేష్టలు గవర్నర్‌కు చూపిస్తారా అంటూ సోమిరెడ్డి ఫైర్
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శాప్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులు చేసిన వికృత చేష్టల వీడియోలను గవర్నర్‌కు చూపిస్తారా అంటూ వైఎస్ జగన్‌ను మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో నిలదీశారు. గత ఐదేళ్ల పాలనలో చేసిన విధ్వంసాలను మర్చిపోయి ఇప్పుడు గవర్నర్ వద్దకు వెళ్లి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకుల అరాచకాలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరని సోమిరెడ్డి హెచ్చరించారు.