గ్రూప్-2 ప్రాథమిక కీ విడుదల: అభ్యర్థులకు కీలక ప్రకటన చేసిన కమిషన్

రిపోర్టర్: మహేష్ స్థలం: తమిళనాడు

తమిళనాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షల ప్రాథమిక కీ త్వరలోనే విడుదల కానుందని అధికారులు వెల్లడించారు. నవంబర్ ఒకటో తేదీన జరిగిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ సమాధానాలను బేరీజు వేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. మూడు వందల మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హులవుతారని కమిషన్ స్పష్టం చేసింది.