బాలీవుడ్ నటి నుష్రత్ భరుచా వెన్నుపూసకు తీవ్ర గాయం: ఆస్పత్రి నుంచి వీడియో షేర్

రిపోర్టర్: అశోక్ స్థలం: ముంబై

బాలీవుడ్ ప్రముఖ నటి నుష్రత్ భరుచా ఇటీవల బాలిలో జరిగిన ప్రమాదంలో వెన్నుపూస తీవ్రంగా గాయపడినట్లు ఆమె బృందం వెల్లడించింది. ఈ దుర్ఘటన తర్వాత ముంబైకి ఎయిర్ అంబులెన్స్లో తరలించి శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నానని, ఈ కష్టకాలంలో షారుఖ్ ఖాన్ పాటలు తనకు ఎంతో ఊరటనిస్తున్నాయని ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొంటూ అభిమానులకు తన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టతనిచ్చారు.