భారీ ఊరట: ఐఓఏ అథ్లెట్స్ కమిషన్ కు ఏకగ్రీవంగా ఎన్నికైన మంజిత్ సింగ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: New Delhi
భారత ఒలింపిక్ సంఘం అథ్లెట్స్ కమిషన్ కు పురుషుల పతక విజేతల విభాగంలో మాజీ రోవర్ మంజిత్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఈ విభాగంలో ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక లాంఛనమైంది. మరోవైపు స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో పీవీ సింధు, మీరాబ చాను సహా పది మంది అథ్లెట్లు మిగిలిన తొమ్మిది స్థానాల కోసం నవంబర్ మూడున జరిగే ఎన్నికల బరిలో నిలిచారు.