కడప నగరపాలక సంస్థపై ఎగిరిన కూటమి జెండా: మేయర్ పీఠం కైవసం

రిపోర్టర్: నరేష్ స్థలం: Kadapa

కడప నగరపాలక సంస్థ ఎన్నికల్ లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైకాపాకు బలమైన స్థావరంగా ఉన్న కడపలో మేయర్ పీఠాన్ని భారీ మెజారిటీతో కైవసం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. మొత్తం అరవై ఆరు డివిజన్లలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారని, ప్రజలిచ్చిన ఈ తీర్పును సుపరిపాలనకు అందిన ఆశీర్వాదంగా భావిస్తున్నామని నారా లోకేష్ స్పష్టం చేశారు.