శ్రీకాకుళం నదీ పరివాహక ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు విస్తృత పర్యటన

రిపోర్టర్: కృష్ణ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా నదీ పరివాహక ప్రాంతాల్లో మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ విస్తృత పర్యటన నిర్వహించారని SRIKAKULAM DISTRICT POLICE వెల్లడించారు. పంట నష్టంపై సమగ్ర సర్వే చేపట్టి రైతాంగానికి పూర్తి పరిహారం అందిస్తామని వారు స్పష్టం చేశారు. విపత్తు సమయంలో సమర్థవంతంగా పనిచేసిన జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అభినందించారని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు అధికార యంత్రాంగం నిరంతరం అందుబాటులో ఉంటూ సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.