ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు
రిపోర్టర్: శివ
స్థలం: తెలంగాణ
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు-2027 ఫీజు చెల్లింపునకు సంబంధించి షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యామండలి విడుదల చేసింది. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 24 నుంచి అక్టోబర్ 29 వరకు ఫీజు చెల్లించవచ్చు. రూ.1,000 ఆలస్య రుసుముతో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 10 వరకు గడువు ఇచ్చారు. మొదటి, రెండో సంవత్సరం సాధారణ థియరీ పరీక్షలకు రూ.600, ప్రాక్టికల్స్‌కు రూ.275గా ఫీజు నిర్ణయించారు.