పుంగనూరు హింసాత్మక ఘటన: డ్రోన్ ఫుటేజ్ బయటపెట్టిన పోలీసులు
రిపోర్టర్: రాము
స్థలం: Chittoor
పుంగనూరులో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వర్గీయులపై పక్కా ఆధారాలు సేకరించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ముందస్తు పథకం ప్రకారమే వారు దాడికి తెగబడ్డారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయని, చట్టపరమైన అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు. ఈ పరిణామాలపై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది.