ట్యాంక్ బండ్ వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆందోళన తీవ్ర ఉద్రిక్తత

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జన ఆంక్షలపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిమజ్జనాన్ని నిషేధిస్తూ విధించిన ఆంక్షలను వ్యతిరేకిస్తూ బారికేడ్లను తొలగించేందుకు యత్నించిన సమితి నేతలను పోలీసులు అడ్డుకుని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టులను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండిస్తూ, అరెస్టయిన ప్రతినిధులందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.