మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆర్థిక సాయం
రిపోర్టర్: Ajay
స్థలం: మల్యాల
మల్యాల మండలంలోని ముత్యంపేట (కొండగట్టు) గ్రామానికి చెందిన బుర్ర నరేష్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు.