విశాఖలో ఐటీ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ ఆమోదం

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన 21వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో విశాఖపట్నంలో రూ.526.25 కోట్ల పెట్టుబడులతో 10 ఐటీ ప్రాజెక్టులకు ఆమోదముద్ర పడింది. ఇందులో ఏడు క్వాంటం ప్రాజెక్టులతో పాటు ప్రముఖ సంస్థలు డెలాయిట్, ముత్తూట్ ఫిన్‌కార్ప్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్రలో ఐటీ విస్తరించి స్థానిక యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.