మహిళల భద్రతపై బాపట్ల పోలీసుల పనితీరును అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రిపోర్టర్: రాజేష్
స్థలం: బాపట్ల
మహిళల భద్రత మరియు గంజాయి నిర్మూలనలో ముందంజలో ఉన్న బాపట్ల జిల్లా పోలీస్ శాఖను, జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించినట్లు బాపట్ల పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక నిబంధనల ప్రకారం శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చూపుతున్న చొరవను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారని పోలీసులు స్పష్టం చేశారు.