తెలంగాణలో మాతృస్వామ్య పాలన రావాలని కోరుకుంటున్న బిఆర్ఎస్ నేత కవిత

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: తెలంగాణ

తెలంగాణ రాజకీయంలో బిఆర్ఎస్ నాయకురాలు కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 2009 ఎన్నికల సమయంలో కోస్గిలో నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో కలిసి తాను ఒకే వేదికపై ప్రచారంలో పాల్గొన్నానని, నాటి ఆ ఇద్దరు నేతలు నేడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారని గుర్తుచేశారు. ప్రజా ఆశీర్వాదం ఉంటే భవిష్యత్తులో తాను కూడా రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడిపించగలనని, తెలంగాణ గడ్డపై మాతృస్వామ్య పాలన రావాల్సిన అవసరం ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.