తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం విడుదలకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటేరియట్‌లో సీఎస్‌తో జరిగిన ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమావేశంలో రెండు డీఏలను ఆమోదించారు. మొదటి డీఏను అక్టోబర్ నెల జీతంతో కలిపి చెల్లించనుండగా, రెండవ డీఏను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. అయితే ఉద్యోగులు పీఆర్సీని డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం కేవలం డీఏలకే పరిమితం కావడం చర్చనీయాశమైంది.