నేడు తెలంగాణ శాసనసభలో కీలక బిల్లుల ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
తెలంగాణ శాసనసభ సమావేశాలు నేడు ఆరో రోజుకు చేరుకున్నాయి. సభలో రెండు కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ బిల్లు, కోర్ అర్బన్ రీజియన్ సమగ్ర పరిపాలన బిల్లులపై చర్చ జరగనుంది. అలాగే సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న 22ఏ నిషేధిత జాబితా అంశంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.