అన్నదాతలకు తీపి కబురు: నెలకు మూడు వేల పింఛను అందించే అద్భుత పథకం
రిపోర్టర్: రమేష్
స్థలం: న్యూఢిల్లీ
వ్యవసాయంపై ఆధారపడిన చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో స్థిరమైన ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ మాంధన్ యోజనను అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయస్సు గల రైతులు ఈ పథకంలో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. అరవై ఏళ్ల వయస్సు పూర్తయిన తర్వాత ప్రతి లబ్ధిదారుడికి నెలకు మూడు వేల రూపాయల పింఛను అందుతుందని వెల్లడించారు.