యువర్స్ బాబీ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరణ
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
జెనీషా ఏ వన్ మూవీ పతాకంపై సంజయ్ ఆర్, రావ్ హీరో హీరోయిన్లుగా రామ్ మోహన్ .సిహెచ్ దర్శకత్వంలో మల్కాజిగిరి రవికుమార్ తెరకెక్కించిన లవ్ ఎంటర్ టైనర్ యువర్స్ బాబీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుందని, ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ నటుడు బ్రహ్మాజీ ఆవిష్కరించారని నిర్మాత తెలిపారు. నేటి యువతను ఆకట్టుకునే కథనంతో ఈ సినిమా ముందుకు సాగుతుందని, త్వరలోనే విడుదల తేదీని వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.