హార్దిక్ పాండ్యా రీఎంట్రీపై స్పష్టతనిచ్చిన భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్ లోకి పునరాగమనం చేయాలంటే ముందుగా దేశవాళీ మ్యాచ్ లు ఆడి పూర్తి స్థాయి ఫిట్ నెస్ నిరూపించుకోవాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. ఐపీఎల్ తర్వాత తగినన్ని మ్యాచ్ లు ఆడకపోవడం, వర్క్ లోడ్ కారణంగా అతన్ని నేరుగా అంతర్జాతీయ మ్యాచ్ లలో ఆడించలేమని, ఇండియా ఏ సిరీస్ ద్వారా మళ్లీ జట్టులోకి రావాలని గంభీర్ తేల్చిచెప్పారు.