అమెరికా స్టార్ క్రీడాకారుడు పాట్రిక్ మహోమ్స్ భారీ విలాసవంతమైన నివాసం

రిపోర్టర్: వెంకట్ స్థలం: Kansas City

అమెరికా ఫుట్బాల్ స్టార్ ఆటగాడు పాట్రిక్ మహోమ్స్ మిస్సోరీలోని బెల్టన్ ప్రాంతంలో ఎనిమిది ఎకరాల ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి సుమారు ఎనిమిది మిలియన్ డాలర్ల వ్యయంతో ఒక విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. తన కుటుంబ జీవన శైలికి తగినట్లుగా మైదానాలు మరియు ప్రత్యేక వసతులతో ఈ ఇంటిని అతడు స్వయంగా తీర్చిదిద్దినట్లు సమాచారం.