షాకింగ్ ఘటన: మంత్రాల పేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్లాగర్ అరెస్ట్

రిపోర్టర్: కిరణ్ స్థలం: కొల్లం

మంత్రాల పేరుతో పదహారేళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఇస్లామిక్ అకాడమీ డైరెక్టర్, వ్లాగర్ మహమ్మద్ నియాస్ జౌహరిని అరెస్ట్ చేసినట్లు ఓచీరా పోలీసులు వెల్లడించారు. అనారోగ్యం నయం చేస్తానని నమ్మించి కుటుంబ సభ్యుల నమ్మకం గెలుచుకుని, వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని కటకటాల్లోకి నెట్టామని పోలీసులు స్పష్టం చేశారు.