ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు

రిపోర్టర్: Anjaneyulu Yadav స్థలం: కల్వకుర్తి

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో గత 11 రోజులుగా రుద్రసేన యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈసందర్భంగా యూత్ సభ్యులు గురువారం రాత్రి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. పసుల వెంకట్ రెడ్డి మంజుల దంపతులు అన్నదానం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదని స్వీకరించారు.