ఇండోనేషియాలో ఘోర ప్రమాదం, జావా సముద్రంలో మునిగిన నౌక
రిపోర్టర్: శివ
స్థలం: World
ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణికుల నౌక బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, మరో 129 మంది గల్లంతయ్యారు. నౌకలో మొత్తం 243 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఇప్పటివరకు 108 మందిని రక్షించారు. భారీ అలలు, ఈదురుగాలుల కారణంగా సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.