ఢిల్లీలోని సీఎం శ్రీ పాఠశాలను సందర్శించిన శ్రీలంక ప్రతినిధి బృందం

రిపోర్టర్: మహేష్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలోని సరోజిని నగర్ సీఎమ్ శ్రీ పాఠశాలను శ్రీలంక ప్రతినిధి బృందం సందర్శించిందని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ వెల్లడించారు. ఈ బృందంలో జేవీపీ జనరల్ సెక్రటరీ తిల్విన్ సిల్వాతో పాటు ఇతర అధికారులు ఉన్నారని ఆయన తెలిపారు. పాఠశాలలోని స్మార్ట్ తరగతి గదులు, డిజిటల్ లైబ్రరీలు, ఐసీటీ ల్యాబ్లను విదేశీ ప్రతినిధులు పరిశీలించారన్నారు. ఢిల్లీ విద్యా విధానంలో వస్తున్న మార్పులను తెలుసుకునేందుకే వారు ఇక్కడ పర్యటించినట్లు మంత్రి పేర్కొన్నారు.