ఉచిత న్యాయసేవలను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి సూచన
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద ఉన్న కేంద్ర కారాగారాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నరసింహమూర్తి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడి వారి కేసుల వివరాలు, భోజనం, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని ఖైదీలకు ఉచితంగా న్యాయవాదిని సమకూరుస్తామని, అవసరమైన వారు లీగల్ కౌన్సిల్ సభ్యులను సంప్రదించాలని ఆయన సూచించారు.