వికారాబాద్ హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
రిపోర్టర్: సతీష్
స్థలం: Hakimpet, Vikarabad, Telangana
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేట్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న భవన సముదాయాల పురోగతిని ఆయన సమీక్షించారు. విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, ఈ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు అధికారులకు దిశానిర్దేశం చేసింది. నాణ్యతతో కూడిన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.