నాగబాబు నియామకంపై లాభదాయక పదవుల వివాదం
రిపోర్టర్: అశోక్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా జనసేన నేత నాగబాబు నియామకం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించడంపై ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనల కింద ఆయన ఎమ్మెల్సీ సభ్యత్వంపై ప్రభావం పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ వివాదానికి ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.