మానసిక స్థైర్యంతో విధి నిర్వహణలో ముందడుగు వేయాలన్న హోంమంత్రి అనిత
రిపోర్టర్: గోపి
స్థలం: విజయనగరం
మానసిక స్థైర్యంతో ముందడుగు వేయాలని, విధి నిర్వహణలో ఎక్కడా వెనుకంజ వేయొద్దని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మహిళా కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు. విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో నిర్వహించిన కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్లో ఆమె మాట్లాడారు. స్టేషన్కు వచ్చే బాధిత మహిళలకు మహిళా కానిస్టేబుళ్లు ఉంటే మరింత ధైర్యంగా ఉంటుందని తెలిపారు. కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం మహిళలకే సాధ్యమని మంత్రి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.