రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతలే పునాది అని హోం మంత్రి అనిత స్పష్టీకరణ
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: మంగళగిరి
రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతలే పునాది అని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న 149 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్‌కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. ఎన్నో అడ్డంకులు అధిగమించి ఆరు వేల మంది కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆమె వెల్లడించారు.