మమత సర్కార్‌కు అభివృద్ధిపై ఎలాంటి శ్రద్ధ లేదన్న కేంద్ర మంత్రి

రిపోర్టర్: సతీష్ స్థలం: Kolkata

కోల్‌కతాలో మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ రంగాలపై కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ లలన్ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని మమత బెనర్జీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మమత సర్కార్‌కు అభివృద్ధి పట్ల ఎలాంటి ఆసక్తి లేదని మండిపడ్డారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలోని అన్ని రంగాలను, అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారని, కానీ ఇక్కడ సహకారం అందడం లేదని ఆయన ఆరోపించారు.