మట్టి ప్రతిమలతో పర్యావరణ పరిరక్షణ చాటిన చిన్నారుల ప్రతిభ
రిపోర్టర్: NANUPATRUNI RANJITH KUMAR
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని జిల్లా వికాస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ స్వయంగా మట్టి విగ్రహాలను తయారు చేసి తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఈ సందర్భంగా విగ్రహాలను ప్రతిభావంతంగా రూపొందించిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా బహుమతులు అందజేసి అభినందించింది. పాఠశాల డైరెక్టర్ కూన వేణుగోపాలరావు మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను కొనియాడుతూ మట్టి విగ్రహాల తయారీ పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నిర్మలతో పాటు ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు.