డి పట్టా భూములను కాపాడాలంటూ గిరిజన రైతుల ఆందోళన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: రావికమతం

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొమిరి రెవెన్యూ పరిధిలో గిరిజన రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై సీపీఎం నాయకులు, సాగుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన డి-పట్టా భూములు రీ-సర్వేలో రికార్డులు మారిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మైనింగ్ క్వారీ వ్యర్థాలతో పంట పొలాలు దెబ్బతింటున్నాయని, వెంటనే అధికారులు స్పందించి పట్టాలు పునరుద్ధరించాలని నాయకులు డిమాండ్ చేశారు.