కాకా ఆదర్శాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం: మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి

రిపోర్టర్: రాము స్థలం: సిద్దిపేట

పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం, విద్య ద్వారా సమాజ అభివృద్ధి కోసం కాకా గారు జీవితాంతం కృషి చేశారని పొన్నం ప్రభాకర్ - మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆప్యాయంగా పలకరించిన ఆయన వ్యక్తిత్వం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. కాకా గారి కుటుంబంతో తనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని, ఎన్ఎస్ యూఐ రోజుల నుంచే ఈ సంబంధం కొనసాగుతోందని ఆయన గుర్తు చేసుకున్నారు.