సినిమా అప్డేట్: ఉత్కంఠభరితంగా చంద్రయాన్ సినిమా ట్రైలర్ విడుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: మందమర్రి

మందమర్రికి చెందిన నలుగురు యువకులు గూగుల్ సహాయంతో రాకెట్ తయారు చేసి చంద్రుడి మీదకు పంపే కథాంశంతో తెరకెక్కిన చంద్రయాన్ సినిమా ట్రైలర్ శుక్రవారం విడుదలైందని చిత్ర యూనిట్ వెల్లడించింది. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని ప్రధాన పాత్రల్ లో నటించారు. ఈ నెల 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది.